గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిజాం జమానాలో ఈ జలాశయాన్ని నిర్మించారు. ఈ జలాశయానికి సిద్దిపేట జిల్లాలోని కూడెల్లివాగు, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచవాగులు ఆధారం. వర్షాలు లేక వాగులు పారక జలాశయంలో ప్రస్తుతం 0.612 టీఎంసీల నీరుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ప్రారంభిస్తే గోదావరి జలాలు కూడెల్లివాగు ద్వారా వచ్చి ఎగువ మానేరులో చేరే అవకాశం ఉంది. కానీ మధ్యమానేరులోనే నీటి నిల్వలు లేక కూడెల్లి వాగు పారే అవకాశం లేదు. వర్షాలు సమృద్ధిగా పడితేనే ఎగువ మానేరు నిండే పరిస్థితులు. ఈ జలాశయంపై ఆధారపడిన 10 వేల ఎకరాలకు కన్నీరే దిక్కవుతుంది.


