ప్రజాస్వామ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

నీట్‌ లీకేజీతో విద్యార్థులు ఆగమయ్యారు

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల: పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో బుధవారం డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ నీట్‌ పరీక్షలను ముందుగా 23 లక్షల మంది రాయగా.. ఆ పరీక్ష రద్దుతో 20 లక్షల మంది మాత్రమే రాశారన్నారు. ప్రభుత్వ వైఖరితో 3 లక్షల మంది భవిష్యత్‌ను కోల్పోయారన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌ వంటి నేతలు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనూ పేపర్‌ లీకేజీలు జరిగాయన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాల య చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, నాయకులు ఫకృద్దీన్‌, కూస రవీందర్‌, పుల్కం రాజు, కేతిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, ఫిరోజ్‌పాషా, ఆడెపు చంద్రకళ, యెల్లె లక్ష్మీనారా యణ, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, రొడ్డ రాజు పాల్గొన్నారు.

నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

సిరిసిల్లటౌన్‌: నీట్‌–2026 విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రషీద్‌, రిషి, మనోజ్‌, భువనేశ్వర్‌, నిఖిల్‌, చందు, చరణ్‌, అరుణ్‌, వినయ్‌, శ్రీశాంక్‌, లవేశ్వర్‌, సాయి, తౌహీద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement