మల్కపేట.. నీటి వేట | - | Sakshi
Sakshi News home page

మల్కపేట.. నీటి వేట

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

మల్కపేట.. నీటి వేట

కోనరావుపేట మండలం మల్కపేటలో 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీరుంది. ఈ రిజర్వాయర్‌కు మళ్లీ మధ్యమానేరు జలాశయమే ఆధారం. మధ్యమానేరు బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా మల్కపేట వరకు మళ్లించి అక్కడి నుంచి పంపింగ్‌ చేస్తే మల్కపేట రిజర్వాయర్‌ నిండుతుంది. గతేడాది సాగునీటికి రైతుల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మధ్యమానేరు నుంచి పంపింగ్‌ లేకపోవడంతో మల్కపేట జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయలేమని అధికారులు ప్రకటించారు. దీంతో మల్కపేట జలాశయం పరిధిలోని రైతులు సాగునీటి వేటలో పడ్డారు. ఈ రిజర్వాయర్‌కు మధ్యమానేరు తప్ప మరో ఆధారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement