సంస్కృత పాఠశాలలో చదివాను | - | Sakshi
Sakshi News home page

సంస్కృత పాఠశాలలో చదివాను

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

సంస్కృత పాఠశాలలో చదివాను భక్తులకు మెరుగైన సేవలు సేవలు విస్తరిస్తాం

రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేదపాఠశాలలో వైదిక స్మార్తం చదువుకున్నాను. జూన్‌ 9న పరిచారిక పరీక్ష నిర్వహించారు. ఈనెల 17న నియమాకపత్రం అందజేశారు. స్వామి సేవచేసే అవకాశం రావడంతో జన్మ ధన్యమైంది. ఈ బాధ్యతను భక్తి, నిబద్ధతతో నిర్వర్తిస్తాను.

– శనిగరం నాగేందర్‌ ప్రసాద్‌,

పరిచారక, వేములవాడ

దాదాపు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. మాకు సహకరించిన పెద్దలకు, ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు. చాలా కాలంగా ఈ నియామకాల కోసం ఎదురుచూశాం. ఇప్పుడు రాజన్న ఆలయంలో సేవచేసే అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం, దేవాదాయశాఖ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను.

– బూరుగుగడ్డ శ్రీనందన్‌, వైష్ణవ అర్చక, వేములవాడ

రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి 21 పోస్టులు కేటాయించడం సంతోషకరం. కొత్తగా నియమితులైన అర్చకులు, పరిచారకులు, వాద్య కళాకారులు ఆలయ సేవలను సమర్థంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంకితభావంతో పనిచేయాలి. ఎంపికై న వారికి శుభాకాంక్షలు.

– ఎల్‌.రమాదేవి, ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement