ప్రకృతి కొలుపు.. అనుబంధాల పిలుపు
ఆ కంప్యూటర్లు
బో‘నమో’ పోచమ్మ తల్లి
● వైద్య, ఆరోగ్యశాఖలో కంప్యూటర్లు మాయం ● నేషనల్ హెల్త్ మిషన్‌లో 15 కంప్యూటర్లు మంజూరు ● మూడు పీహెచ్‌సీలకు... మరో మూడు ఆఫీస్‌లో వినియోగం ● జాడలేని 9 కంప్యూటర్లు
బోనాల జాతరలో గంభీరావుపేట గ్రామస్తులు
కరీంనగర్‌లో గోరింటా వేడుకల్లో మహిళలు
వీర్నపల్లి మండలంలోని గిరిజనతండాలో సీత్లాభవాని అమ్మవారు
మనిషి.. ప్రకృతితో కలిసి జీవించాలన్న సత్యాన్ని మన పండుగలు గుర్తుచేస్తున్నాయి. మానవ మనుగడకు ప్రకృతి సహకారం ఎంత అవసరమో మన ఆచారాలు తట్టి లేపుతున్నాయి. మనిషి ఎప్పుడూ ఒంటరిగా మనుగడ సాగించలేడని.. సామూహిక జీవి అని మన బంధాలు నిరూపిస్తున్నాయి. పండుగలు.. ఆచారాలు.. అనుబంధాల సామూహిక వేడుక ఆషాఢానికి ప్రత్యేకం. ఈ మాసంలో పాడిపంటలు సంవృద్ధిగా ఉండాలని గిరిజనులు సీత్లాభవాని.. పిల్లపాపలు క్షేమంగా ఉండాలని గ్రామదేవతలకు బోనం మొక్కులు.. ఆరోగ్యం బాగుండాలని గోరింటాకు వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ సామూహిక అనుబంధాల కలయికకు వేదికగా నిలిచే ఆషాఢ మాసం వేడుకలపై ప్రత్యేక కథనం. – వివరాలు 8లో..
సిరిసిల్ల: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో నెల రోజుల కిందట మంజూరైన కంప్యూటర్ల లెక్క తేలడం లేదు. జిల్లాకు 15 కంప్యూటర్లను ఎన్‌హెచ్‌ఎంలో మంజూరు చేశారు. ఒక్కో కంప్యూటర్ విలువ రూ.లక్షకు పైగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల డేటాను నమోదు చేస్తూ.. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించేందుకు ఉద్దేశించిన కంప్యూటర్లును పూర్తి స్థాయిలో వినియోగించడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తొమ్మిది కంప్యూటర్లు ఏమయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖలో చర్చ సాగుతుంది.
మూడు పీహెచ్‌సీలకు..
జిల్లాలోని మూడు పీహెచ్‌సీలకు ఎన్‌హెచ్‌ఎంలో మంజూరైన కొత్త కంప్యూటర్లను అందించారు. మరో మూడు కంప్యూటర్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లోనే వినియోగిస్తున్నారు. ఇంకా 9 కంప్యూటర్లను ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అసలు వాటిని వినియోగిస్తున్నారా? దాచి ఉంచారా? అనేది అంతుచిక్కడం లేదని ఆ శాఖలోని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో విలువైన 9 కంప్యూటర్లను ఎవరు మాయం చేశారనే చర్చసాగుతుంది. జిల్లా వైద్యాధికారి రజిత బదిలీ కాగా.. ఆమె స్థానంలో ఏంజెలా ఆల్ఫ్రెడ్ జిల్లా వైద్యాధికారిగా ఇటీవల విధుల్లో చేరారు. ఈ సంధికాలంలోనే కంప్యూటర్లు రావడంతో మాయాజాలం చేశారని భావిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కంప్యూటర్ల విభాగాన్ని నిర్వహించే వారే ఆ కంప్యూటర్లను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యులు శనివారం పోచమ్మ తల్లికి బోనాలు తీశారు. కొత్తకుండిలో అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించారు. ముత్యాలపోచమ్మను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. వైశ్యసంఘం ప్రముఖులు కటకం సత్తయ్య, అల్లా డి శ్రీనివాస్, చేపూరి బుచ్చయ్య, కత్కమ్ సత్తయ్య, కొత్తపల్లి శ్రీని వాస్, రాజూరి వాసుదేవరాజు, ఎల్లంకి వాణి, అల్లాడి దేవి, ఇందిరా జమున, చంద్రకళ, ఉమాదేవి, బాలలక్ష్మి, పుల్లూరి అరుణ, ఎల్లంకి శ్రీనివాస్ పాల్గొన్నారు.


