● రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటలో రూ.45 లక్షలతో చారిత్రక జామా మజీద్ విస్తరణ, మరమ్మతు పనులకు శుక్రవారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చై ర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ శంకుస్థాపన చే శారు. ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలతో పనులు ప్రారంభించారు. నిత్యం నమాజ్ చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల ను దృష్టిలో పెట్టుకొని జామా మసీదును విశాలంగా విస్తరించి, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చే యనున్నారు. సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ మాట్లాడుతూ.. గంభీరావుపేట జామా మసీదు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూ ర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మసీదు ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా సుమారు రూ.90 లక్షల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు. మహ్మద్ మహబూబ్ అలీ, సయ్యద్ జుబైర్, మహ్మద్ అస్లం, సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ, సయ్యద్ అసదుల్లా హుస్సేనీ, హాఫిజ్ అబుల్ కలాం, మహ్మద్ వసీమ్, సయ్యద్ హాష్మీ, సఫీఉద్దీన్ నయీర్, యాసిన్ హుస్సైన్, మహ్మద్ రహీముద్దీన్, మహ్మద్ తాహిర్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ విలాయతుల్లా, మహ్మద్ ఆరిఫుద్దీన్, మహ్మద్ నజ్ముద్దీన్, నాసిర్ హుస్సేనీ, మహ్మద్ షాహిద్ అలీ, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మహ్మద్ తురాబ్ అలీ, పురావస్తు సంరక్షణ నిపుణుడు మీర్ బరఖతుల్లా ఖాన్ పాల్గొన్నారు.


