గంభీరావుపేట/ముస్తాబాద్: సర్ ప్రక్రియపై సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల నాయకులు అప్రమత్తంగా ఉండాలని నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్‌ల సమావేశంలో మాట్లాడారు. సమష్టి కృషితో సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే ముస్తాబాద్‌లో సర్ ప్రక్రియను పరిశీలించి అవగాహన కల్పించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, సర్వర్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, కొండ శ్రీను, శీలం పద్మ, వెంకటేశ్, గొండయ్య, యాదగిరి, సత్యం, దొరగొల్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


