రాజన్న ఆలయానికి 21 పోస్టులు | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయానికి 21 పోస్టులు

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

వేములవాడ: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 191 అర్చక పోస్టులు భర్తీ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కమిషనర్‌ ఎం.హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరిల చేతుల మీదుగా అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి 21 పోస్టులు కేటాయించారు. వీటిలో 11 పరిచారకులు, 2 వైష్ణవ అర్చకులు, 2 తమ్మల అర్చకులు, ఒక అసిస్టెంట్‌ కుక్‌, ఒక శృతి వాయిద్యకారుడు, 2 డోలు వాద్యకారులు, 2 సన్నాయి వాద్యకారుల పోస్టులు ఉన్నాయి.

14 ఏండ్ల నిరీక్షణకు తెర..

దాదాపు 14 ఏళ్ల తర్వాత దేవాదాయశాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నియామకపు పత్రాలు అందుకునేందుకు వేములవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి సహా అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయం నుంచి కల్పించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి ఎంపికై న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement