కోనరావుపేట(వేములవాడ): రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.51లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 38 మందికి రూ.15.46 లక్షల విలువైన సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కులమతాలకు, పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలో అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. కోనరావుపేట మండలంలో రెండు బ్రిడ్జీలకు సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయని, మరో బ్రిడ్జికి డ్రాయింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడలో మూడో బ్రిడ్జికి 2015లో శంకుస్థాపన చేసినప్పటికీ పదేళ్లపాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.6.96 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ క మిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి వైస్‌చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచులు సింగం శ్రీహరి, బోయిని దే వరాజు, భూషణం, తిరుపతి, ఉపసర్పంచ్ రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, ఫిరోజ్‌పాషా, చేపూరి గంగాధర్, గొట్టే రుక్మిణి పాల్గొన్నారు.
వేములవాడ/వేములవాడరూరల్: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 28 మందికి రూ.10.99లక్షల విలువైన చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ తన నివాసంలో పంపిణీ చేశారు. వేములవాడరూరల్ మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 30 మందికి రూ.17లక్షల విలువైన సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను విప్ అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, జిల్లా సెక్రెటరీ వకుళాభరణం శ్రీనివాస్, సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


