రోడ్డు విస్తరణ పనులు ఏడాది గడుస్తున్నా పూర్తి కావడం లేదు. చాలా మంది నాలాంటి చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని పనులు వేగవంతంగా పూర్తి చేయించాలి.
– పాషా, టీస్టాల్, వేములవాడ
ఏడాది గడిచింది
విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయి తే వేములవాడ రూపురేఖలు మారిపోతాయి. రూ.6కోట్లతో చేస్తున్న పనులు ఎప్పుడు పూ ర్తవుతుందో తెలియడం లేదు. ఏడాదిగా దు మ్ము,ధూళితోవ్యాపారాలుదెబ్బతింటున్నాయి.
– గంప గౌరీశంకర్, వ్యాపారి, వేములవాడ
పనులు వేగవంతం చేయిస్తాం
రోడ్డు విస్తరణ పనుల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులతో ప్రస్తుతం పనులు ఆగాయి. భగీరథ పైప్‌లైన్ పనులు, సైడ్ లైటింగ్‌కు సంబంధించిన పోల్స్ పనులు పూర్తి చేసి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తాం.
– పుల్కం రాజు,
వేములవాడ, మున్సిపల్ చైర్మన్


