పర్యాటకంలో సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంలో సిరిసిల్ల

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

వేములవాడకు భక్తుల తాకిడి

తల‘సిరి’ పెరిగినా అట్టడుగునే !

వ్యక్తిగత సగటు ఆదాయం రూ.2,55,984

రాష్ట్రంలో 30వ స్థానం

పసిగుడ్డులను చిదిమేస్తున్నారు

2026 సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక

సిరిసిల్ల: రాజన్న భక్తుల రాకతో జిల్లాకు పర్యాటకు ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ని లిచింది. ఏడాది పొడవునా భక్తులు వస్తుండడంతో వేములవాడతోపాటు నాంపల్లిగుట్ట సందడిగా మా రుతుంటుంది. జిల్లాకు 1,68,32,897 మంది పర్యాటకుల రాకతో వేములవాడ టూరిజం గుర్తింపు పొందింది. గతేడాదితో పోల్చితే జిల్లా తలసరి ఆదా యం పెరిగినా రాష్ట్రస్థాయిలో మాత్రం ర్యాంక్‌ దిగజారింది. 2025లో 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 30వ స్థానానికి పడిపోయింది. గోదావరి జలాల రాకతో జిల్లాలో వ్యవసాయరంగంలో ప్రగ తి సాధించింది. అభివృద్ధి సూచికలో స్వల్పంగా మెరుగుపడింది. సగటు వ్యక్తిగత తలసరి ఆదా యం గతేడాది కంటే రూ.42,259 పెరిగింది. 2026 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా ఆరేళ్లలోపు అమ్మాయిల సంఖ్య తగ్గింది. ఫలితంగా జిల్లాలో పసిగుడ్డులను గుట్టుగా తల్లికడుపులోనే చిదిమేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో వాస్తవాలివీ.

అక్షరాస్యతలోనూ అంతంతే..

జిల్లా అక్షరాస్యత 62.71 శాతం ఉండగా.. పురుషుల అక్షరాస్యత 73.5 శాతం, మహిళల అక్షరాస్యత 52.2 శాతంగా ఉంది. ఆరేళ్ల పైబడిన వారి సంఖ్య 5,03,286 మంది ఉండగా. ఇందులో 3,15,611 మంది చదువుకున్నారు. ఇందులో పురుషులు 1,82,296 మంది కాగా, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో జిల్లా 18వ స్థానంలో ఉంది.

పనిమంతులు 2,53,918 మంది

జిల్లాలో పనిమంతులు 54.10 శాతం ఉన్నారు. జనాభాలో 2,53,918 మంది పనిచేస్తున్నారు. వ్యవసాయదారులు 66,751 మంది కాగా, వ్యవసాయ కూలీలు 1,01,737 మంది ఉన్నారు. పరిమితంగా పనిచేసే వారు 44,745 మంది ఉన్నారు. పనిచేసే అంశంలో రాష్ట్రంలో 30వ స్థానంలో జిల్లా నిలిచింది. గతేడాది ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం(ప్రస్తుత ధరల్లో) రూ.2,13,725 ఉండగా.. ఆ ఏడాది రూ.2,55,984 ఉంది. ఒక్క ఏడాదిలోనే వ్యక్తి తలసరి ఆదాయం రూ.42,259 పెరిగింది. జాతీయ స్థాయిలో సగటు వ్యక్తి ఆదాయం రూ.2,19,575 కాగా.. జిల్లా సగటు ఆదాయం అంతకుమించి ఉండడం విశేషం. జిల్లా ఆదాయం రూ.5,363.27 కోట్లతో ఉంది. గుర్తింపు పొందిన పరిశ్రమలు 97 ఉండగా.. 520 మంది ఉద్యోగులు, 402 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా రూ.147.01కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. జిల్లాలో 1,38,992 కుటుంబాలు ఉండగా.. 16,058 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. జిల్లాలో 4,224 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి.

వరి, పత్తిదే అగ్రస్థానం

వరి, పత్తి పంటలదే అగ్రస్థానం. జిల్లాలో 2,37,373 ఎకరాల్లో వివిధ పంటలు వానాకాలంలో సాగవుతుండగా.. 1,87,688 ఎకరాల్లో వరి, 41,921 ఎకరాల్లో పత్తి పంట వేశారు. జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 80,389 ఉన్నాయి. గృహావసరాల విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 1,78,035 ఉండగా, పరిశ్రమల కనెక్షన్లు 22,255 ఉన్నాయి. జిల్లాలో 666 చెరువులు ఉండగా.. 30,017 ఎకరాలు సాగవుతుంది. వ్యవసాయ అనుబంధంగా పశుసంపద పెరిగింది. గతంలో 4,31,338 పశువులు ఉండగా.. ఈ ఏడాది 5,95,763కి చేరాయి. వస్త్రోత్పత్తి రంగంలోనూ మెరుగుపడినా.. వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగినా.. రాష్ట్రస్థాయిలో చివరి నుంచి నాలుగు స్థానంలో ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement