● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యాలయంలో స్కూల్, జూనియర్ కళాశాల కొనసాగుతున్నట్లు గుర్తించారు. స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య, ఎన్ని గదులు, ఎంత విస్తీర్ణంలో ఉందో ఆరా తీశారు. కాలేజీ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, తహసీల్దార్ మహేశ్‌కుమార్, హెచ్‌ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ విధానంలో జనగణన
జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనగణనకు సంబంధించిన అంశాలపై చార్జ్ సహాయకులు, సాంకేతిక సహాయకులకు శిక్షణను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ నుంచి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ శ్రేయ, శిరీష తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రం పరిశీలన
జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ తనిఖీ చేశారు. పాఠశాలలోని ఏ, బీ విభాగాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో 7,304 మందికి 11 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
సిరిసిల్లటౌన్: విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతి నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్‌కుమార్, శ్రీరాముల సంజన, నాయకులు రమేశ్, రమణ, విమల, నవీన్, సతీశ్, శివ, జశ్వంత్ పాల్గొన్నారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకురావాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి కోరారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మోడల్‌స్కూల్, కేజీబీవీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లోని విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. వీర్నపల్లి, గొల్లపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్.రంజిత్‌కుమార్, సకారం, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
కేంద్రియ విద్యాలయంలో అడ్మిషన్లు
సిరిసిల్ల: జిల్లాలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో 2026–2027 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ ఎన్.శేషప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 2వ తేదీలోగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతి అడ్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. 2వ తరగతి, ఆపై తరగతుల కోసం ఆఫ్‌లైన్ ద్వారా స్కూల్ పనివేళల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు పాఠశాల పనివేళల్లో సంప్రదించవచ్చని కోరారు.


