కొత్తగా పట్టా పుస్తకాలు వచ్చిన రైతులు
25 వరకు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫిబ్రవరి 28 నాటికి పాస్‌పుస్తకాలు పొందిన వారికే అవకాశం జిల్లాలో లబ్ధి పొందనున్న 6,283 మంది రైతులు
చందుర్తి(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత గల రైతులు తగిన పత్రాలతో స్థానిక రైతువేదికల్లో ఏఈవోల వద్ద ఈనెల 25 వరకు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం విధించిన నిబంధల ప్రకారం జిల్లాలోని 6,283 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా రైతుభరోసాకు 1,200 మంది రైతులు దూరమవుతున్నారన్నది అనధికార లెక్కలు మాత్రమే. అయితే యాసంగి పంట సాగు సమయంలో ప్రభుత్వం రైతుభరోసాను అందించలేదు. సోమవారం నుంచి ఎకరం డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. పాత రైతులకే కాకుండా కొత్తగా పట్టా చేయించుకున్న వారికి కూడా పంట పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం
జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల పేర్లను తెలుపుతూ వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. 2025 వానాకాలం పంటకు జిల్లాలోని 1,24,292 మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమైంది.
కావాల్సిన పత్రాలు
ఫిబ్రవరి 28, 2025లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారు అర్హులు. రైతుభరోసా అప్లికేషన్ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్‌లతోపాటు రైతు మొబైల్‌నంబర్ వ్యవసాయాధికారి కార్యాలయానికి తీసుకెళ్లాలి.
మండలం రైతులు
గంభీరావుపేట 440
ఇల్లంతకుంట 686
ముస్తాబాద్ 441
సిరిసిల్ల 305
తంగళ్లపల్లి 863
వీర్నపల్లి 79
ఎల్లారెడ్డిపేట 1,153
బోయినపల్లి 347
చందుర్తి 221
కోనరావుపేట 659
రుద్రంగి 73
వేములవాడ 705
వేములవాడరూరల్ 311


