వెల్లువలా దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువలా దరఖాస్తులు

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

● ప్రజావాణికి 167 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సర్పంచ్‌ భర్తపై విచారణ చేపట్టండి మెడికల్‌ రిపోర్ట్స్‌ ఇప్పించండి కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి ఆర్థిక సహాయం అందించాలి

● ప్రజావాణికి 167 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

మాది ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌. మా సర్పంచ్‌ పెద్దిగారి యాదమ్మ కాకుండా ఆమె భర్త శ్రీనివాస్‌ అన్ని తానంటూ వ్యవహరిస్తున్నాడు. కనీసం వార్డు సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. సర్పంచ్‌ భర్త వ్యవహారంపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలి.

– పోతుగల్‌ గ్రామ పాలకవర్గ సభ్యులు

మాది సిరిసిల్లలోని గణేష్‌నగ. ముస్తాబాద్‌లోని పీపుల్స్‌ ఆస్పత్రిలో గర్భసంచి ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఆపరేషన్‌ ఫెయిల్‌ కావడంతోపాటు మూత్రనాళం వద్ద తీవ్రగాయం చేయడం జరిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారు డీఎంహెచ్‌వో సిరిసిల్లకు రెఫర్‌ చేయగా సంబంధిత మెడికల్‌ రిపోర్ట్స్‌ రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. మెడికల్‌ రిపోర్ట్స్‌ త్వరగా ఇప్పించండి.

– జి.అనూష, సిరిసిల్ల

సిరిసిల్ల మున్సిపల్‌ రోడ్డు డివైడర్లపై ఉన్న కోనోకార్పస్‌ మొక్కలతో అలర్జీలు, శ్వాస సమస్యలు వస్తున్నాయి. డివైడర్లపై మొక్కలు ఏపుగా పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోనో కార్పస్‌ మొక్కలను తొలగించి ఆ స్థానంలో అనుకూలమైన మొక్కలు నాటాలి.

– చెన్నమేని రాజుకుమార్‌, సిరిసిల్ల

సిరిసిల్ల అర్బన్‌: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక పలువురు బాధితులు కలెక్టరేట్‌ బాట పడుతున్నారు. జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటి కప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి 167 దరఖాస్తులు స్వీకరించారు.

నా భర్త 20 ఏళ్ల క్రితం మస్కట్‌లో మృతిచెందాడు. శవం కూడా ఇంటికి రాలేదు. నా ఇద్దరు పిల్లలు సాహరిక, వేణు దివ్యాంగులే. వారి వైద్యఖర్చులకు చాలా వరకు ఖర్చు అవుతున్నాయి. మాది నిరుపేద కుటుంబం. నా పిల్లలకు ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలి. – కళ్యాణం కొమురవ్వ, దేశాయిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement