జిల్లా పరిధిలో రెండు గ్రామాలకో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు మా లక్ష్యం. ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్‌స్టేషన్లు ఎంతో అవసరం. ఈమేరకు ఎన్పీడీసీఎల్ అధికారులకు నివేదికలు పంపిస్తూ మంజూరు చేయిస్తున్నాం. చాలా గ్రామాల్లో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వినియోగదారులు భూమిని కేటాయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం సమస్య ఉంది. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నాం. స్థలం కేటాయిస్తే సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది.
– చిక్కాల రామారావు,
‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల


