● రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్
సిరిసిల్లటౌన్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో ఆయన సమక్షంలో గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ–నర్సాగౌడ్ దంపతులతో పాటు పలువురు వార్డు మెంబర్లు కాంగ్రెస్‌లో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పాలనలో షాడో సీఎంగా ఉన్న కేటీఆర్ తన నియోజకవర్గం అభ్యున్నతిని గాలికి వదిలేశారని ఫలితంగానే గంభీరావుపేట మండలం వెనుకబాటులో కొట్టుమిట్టాడుతుందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం, కాంగ్రెస్ అందిస్తున్న అభివృద్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, మల్లుగారి నర్సాగౌడ్ పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్ద పీట
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వార్డు సభ్యులు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షుడు హమీద్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, ప్రశాంత్, అర్జున్, శ్రీమతి, శిరీష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


