బోయినపల్లి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో రెండురోజులుగా జరుగుతున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ –2026 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, శిక్షణతో కార్యకర్తలకు సిద్ధాంతపరమైన స్పష్టత, కార్యాచరణలో నైపుణ్యం, సమాజ సేవలో అంకితభావం పెరుగుతుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, మండల ప్రభారీ వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఉదారి నరసింహాచారి, మండల మాజీ అధ్యక్షుడు గుడి రవీందర్‌రెడ్డి, సర్పంచులు బొంగాని అశోక్‌గౌడ్, పెంచాల సౌమ్య మహేశ్, నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్‌రెడ్డి, మెరుపుల గంగా ధర్, సంగీత, గంగాధర్‌చారి, కొనుకటి హరీశ్, కొండం శ్రీనివాస్‌రెడ్డి, స్వామికుమార్, శరత్‌చంద్రారెడ్డి, సారంపల్లి రాజు, పాలోజు రాజేంద్రప్రసాద్, అమెరిశెట్టి గంగయ్య, ఇల్లందుల బాలయ్య, జనగం లక్ష్మణ్, సుంకపాక ప్రభు, రజనీకాంత్, ముఖ్యవక్తలు బత్తుల లక్ష్మీనారాయణ, కరెండ్ల మధుకర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, సంగం నరేశ్ పాల్గొన్నారు.


