ఇది సిరిసిల్ల శివారులోని చంద్రంపేట విద్యుత్ సబ్‌స్టేషన్. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సబ్‌స్టేషన్‌లో రెండు ఫవర్ ట్రాన్స్‌ఫార్మర్లు(పీటీఆర్) ఉన్నాయి. వీటి పరిధిలో ఆరు ఫీడర్ల ద్వారా సిరిసిల్లకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. కలెక్టరేట్ శివారులో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదన చేశారు. కలెక్టరేట్ వద్ద మరో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రంపేట సబ్‌స్టేషన్‌పై భారం తప్పుతుంది. ఇక్కడ ఓవర్‌లోడ్‌తో తరచూ సిరిసిల్లలో విద్యుత్ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. రెండో బైపాస్ రోడ్డులో ఒకటి, శాంతినగర్‌లో మరోటి, సుభాష్‌నగర్‌లో మరో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే సిరిసిల్ల పట్టణ విద్యుత్ వినియోగదారుల లోవోల్టేజీ సమస్య తీరుతుంది.


