● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య | - | Sakshi
Sakshi News home page

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

Mar 23 2026 7:05 AM | Updated on Mar 23 2026 7:05 AM

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

చేనేత రంగంపై చిన్నచూపెందుకు?

సిరిసిల్ల: చేనేత, జౌళి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు మొండి చేయి చూపిందని, ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. జనాభా ధామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపితగా కేసీఆర్‌ను ప్రజలు గుర్తిస్తే.. బూతుపితగా సీఎం రేవంత్‌రెడ్డి మారారని విమర్శించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ పాలనలో చేనేత, జౌళి రంగానికి రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.258 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి చేనేత రంగానికి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, ‘సెస్‌’ డైరెక్టర్‌ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీలు గజభీంకార్‌ రాజన్న, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, నాయకులు బొల్లి రామ్మోహన్‌, గుండ్లపల్లి పూర్ణచందర్‌, మ్యాన రవి, సత్తార్‌, కోడి అంతయ్య, కౌన్సిలర్లు బింగి రాంబాబు, ఎలుక వెంకటేశ్‌యాదవ్‌, నాగరాజు, బాలు, నరేశ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement