జరిమానా నుంచి మినహాయించండి | - | Sakshi
Sakshi News home page

జరిమానా నుంచి మినహాయించండి

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

● కలెక్టరేట్‌ ఎదుట రైస్‌మిల్లర్ల ధర్నా

● కలెక్టరేట్‌ ఎదుట రైస్‌మిల్లర్ల ధర్నా

సిరిసిల్ల: డిఫాల్ట్‌ మిల్లర్లకు విధించిన 25శాతం జరిమానాను తొలగించాలని, 12 శాతం వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ రైస్‌మిల్లర్లు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ పెండింగ్‌ బియ్యం అందించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరారు. ఇటీవల కరీంనగర్‌లో ఓ రైస్‌మిల్లర్‌ భార్య స్వప్న ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్లులు నష్టాల్లో ఉన్నాయని, ప్రభుత్వం చొరవచూపి జరిమానాలు లేకుండా.. బియ్యం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు పబ్బ నాగరాజు, ప్రతినిధులు గర్రిపెల్లి ప్రభాకర్‌, బండ మల్లేశంయాదవ్‌, ఎస్‌.రాజిరెడ్డి, సీహెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement