మంటలార్పిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

మంటలార్పిన అధికారులు

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

మంటలార్పిన అధికారులు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష మహిళా సాధికారతతో దేశాభివృద్ధి సెస్‌ కార్మికుల సమస్యలపై పోరాటం సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్ల–అల్మాస్‌పూర్‌ మధ్య గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అటవీ సంపద కాలిపోతుందని సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఫారెస్ట్‌ అధికారులు స్పందించారు. వీర్నపల్లి ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి రంజిత్‌కుమార్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టవద్దని కోరారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష సోమవారం నాటికి 28వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 11/6 కాలువ పనులు పూర్తి చేయాలని 28 రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కరికె నవీన్‌కుమార్‌, సేరు ఎల్లం, శ్రీనివాస్‌, వీర దేవరాజు, గాదె రవి, భారతి, అనిత, కమటం లావణ్య పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: మహిళల సాధికారతతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్లు దార్నం అరుణ, బొల్గం వైష్ణవి, కూర భాగ్యలక్ష్మి, నెల్లుట్ల లలిత, అడిచర్ల రూప, ఆకుల స్వప్న, గెంట్యాల శ్యామల, కొండ వర్షిణి, పాశికంటి రమ్య, రిక్కమల్ల రజితను సన్మానించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దయిత శ్రీలత, పట్టణ అధ్యక్షురాలు ఎల్లంకి వాణి, డాక్టర్‌ మంజూష, సంఘ కార్యదర్శులు చేపూరి జమున, గౌరిశెట్టి ఇందిర, ఎల్లంకి ఉమ, రాణి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: సెస్‌ కార్మికుల సమస్యలపై పోరాడుతామని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈనెల 11వ తేదీ ఉదయం 6 నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సెస్‌ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంలో యాజ మాన్యం, పాలకవర్గం మొండి వైఖరి ప్రదర్శి స్తుందన్నారు. నాయకులు సంతోష్‌నాయక్‌, రాచకొండ శ్రీనివాస్‌, శివ పాల్గొనారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): సర్వేయర్ల సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ ఏడీ సర్వేకు సోమ వారం వినతిపత్రం అందించారు. సర్వేయర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కావటి మహిపాల్‌ మాట్లాడుతూ శిక్షణ అనంతరం 91 మందిని గుర్తించి లైసెన్స్‌లు జారీ చేశారన్నారు. ఇందులో 66 మంది సర్వేయర్లకు వివిధ మండలాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. మరో 25 మందికి వివిధ మండలాలు కేటాయిస్తూ ఇచ్చే లైసెన్స్‌ల జారీలో పాతవారికి అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement