ఆలకించండి.. ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. ఆదుకోండి

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

వివిధ సమస్యలపై 179 దరఖాస్తులు

ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించి.. పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 179 మంది తమ దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు విధిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement