పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌ | - | Sakshi
Sakshi News home page

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌

Nov 8 2025 7:06 AM | Updated on Nov 8 2025 7:06 AM

పోక్స

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

సిరిసిల్లకల్చరల్‌: జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తిగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి రాధికా జైస్వాల్‌ పదోన్నతి పొందారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

ధర్మగుండంలోకి గోదారమ్మ నీళ్లు

వేములవాడ: రాజన్న ఆలయ ధర్మగుండంలోకి గోదారమ్మ నీళ్లతో నింపుతున్నారు. శుక్రవారం గోదారమ్మ నీటిని మిడ్‌ మానేరు నుంచి నేరుగా పైపులైన్‌ ద్వారా సరఫరా చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ధర్మగుండంలో గోదారమ్మ నీళ్ల వద్ద స్నానాలు చేస్తూ తరించిపోయారు.

కొనసాగిన జాతర

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూ డు రోజులుగా జరుగుతున్న మహాజాతర శుక్రవారం కొనసాగింది. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి భా రీగా భక్తులు తరలివచ్చారు. మహిళలు తమకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, రైతుల వివరాలు పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని, తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ఏవో రాజశేఖర్‌, ఏఈవో శ్రీశైలం, రైతులు, నిర్వాహకులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ఇల్లంతకుంట: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు పరకాల రవీందర్‌, జంగిటి రాజు అన్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీనియర్‌ ఉపాధ్యాయులను టెట్‌ పరీక్ష నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, బెజగం సురేశ్‌, కోటగిరి లక్ష్మణ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఐక్యతతోనే బీసీల

రిజర్వేషన్లు సాధ్యం

ముస్తాబాద్‌: ఐక్యతతోనే బీసీల రిజర్వేషన్లు సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కొండ యాదగిరి అన్నారు. ముస్తాబాద్‌లో బీసీ జేఏసీ సమావేశం శుక్రవారం జరిగింది. ప్రభుత్వాలు దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈనెల 16న ముస్తాబాద్‌లో మండల బీసీ జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఇడుగురాళ్ల సురేశ్‌, చెవుల మల్లేశ్‌, పిట్ల రాంగోపాల్‌, గూ డూరి భరత్‌, అంజాగౌడ్‌, విఠల్‌, శీలం స్వామి, చిగురు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌1
1/3

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌2
2/3

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌3
3/3

పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement