అంతటా ‘వందేమాతరం’
సిరిసిల్ల: దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు నిండిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వందేమాతరం గేయాలా పన నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, సీపీవో శ్రీని వాసాచారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరై గేయాలాపన చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో..
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్‌లో వందేమాతరం గేయాలాపన చేశారు. ఎస్పీ మహేష్ బిగితే, ఇన్‌స్పెక్టర్లు రవి, నాగేశ్వరరావు, మధూకర్, ఆర్‌ఐలు రమేశ్, యాదగిరి, ఎస్సైలు కిరణ్‌కుమార్, క్రాంతికుమార్, రాజు, సాయికిరణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతటా ‘వందేమాతరం’


