ఆదమరిస్తే అంతే..
● పదిర వంతెనపై రాత్రికి రాత్రే ఏర్పడ్డ పెద్ద గుంత
సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిలో గల ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై రాత్రికి రాత్రే పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ వంతెనపై ఏర్పడ్డ గుంతను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. ఇటీవల చేవెళ్ల వద్ద రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్లనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై ఏర్పడ్డ గుంతను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం సందర్శించి ఆర్‌అండ్‌బీ డీఈతో మాట్లాడి మరమ్మతు చేయాలని కోరారు. స్పందించిన డీఈ గుంతపై తాత్కాలికంగా చెట్లు, ఎర్రని బట్ట ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో గుంతను పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)
ఆదమరిస్తే అంతే..


