
మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఎం.హరిత
సిరిసిల్ల: నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం.హరిత ఆదేశించా రు. అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్)పై జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్య, మెప్మాశాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వయోజన మహిళలకు ఫౌండేషనల్ లిటరసీ, బేసిక్ ఎడ్యుకేషన్‌పై అవగాహన అందించడం లక్ష్యమన్నారు. వ యోజనుల కోసం అక్షర వికాసం, వలంటీర్ల కోసం మార్గదర్శిని పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అక్షర వికాసం పుస్తకాలు 21,894 రాగా.. మార్గదర్శిని 2,190 పుస్తకా లు వచ్చాయని, జిల్లాలో 23,387 మంది వయోజనులను గుర్తించామని పేర్కొన్నారు. డీఆర్డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్‌డీవో శ్రీనివాస్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, వయోజన విద్య శాఖ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.