
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్లఅర్బన్: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, పెద్దబోనాల, సర్ధాపూర్‌లోని ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే సింగిల్‌విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 231 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూపరెడ్డి, పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ ఆలీ బేగ్, నక్క నర్సయ్య, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.