
గుడి ఎదుట గజిబిజీ
వేములవాడ మెయిన్‌రోడ్డు విస్తరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాలను అధికారులు కూల్చేశారు. దీంతో పక్కనే ఉన్న శిథిలాలు, వాటి మధ్యలో కనిపిస్తున్న చిన్నపాటి స్థలాల్లో ఓవైపు చిరువ్యాపారులు, మరోవైపు ఆటోలు, ఇతర వాహనాలు నిలిచి ఉండడంతో అంతా గజిబిజీగా మా రింది. సోమవారం రద్దీ పెరిగిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం త్వరగా రోడ్డు పనులు చేపట్టి భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – వేములవాడ