● డీడబ్ల్యూవో లక్ష్మీరాజం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండలంలోని సారంపల్లి ప్రభుత్వ ట్రైబల్ పాఠశాల, కళాశాలలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు, గృహలక్ష్మి, గృహజ్యోతి వంటి ప్రతీ పథకంలో మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. షీటీం ఇన్‌చార్జి ప్రమీల, ప్రిన్సిపాల్ రజని, దేవిక, మమత పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు పెన్షన్ చెల్లించాలి
సిరిసిల్లటౌన్: దేశంలోని బీడీ కార్మికులకు ప్రభుత్వం రూ.7,500 పెన్షన్ అందించాలని బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేశ్‌చంద్ర కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రిటైర్డ్ బీడీ కార్మికులకు పెన్షన్‌తోపాటు పీఎఫ్ డబ్బులు అందివ్వాలని కోరారు. కార్మికుల పీఎఫ్ డబ్బులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ కార్మికులకు అన్యాయం చేయడం శోచనీయమన్నారు. జిందం కమలాకర్, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు.
శాసీ్త్రయ దృక్పథం పెంపే లక్ష్యం
సిరిసిల్లఎడ్యుకేషన్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథం, శాస్త్ర ప్రచారం పెంపొందించడమే లక్ష్యమని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్ తెలిపారు. వేములవాడలోని ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెకుముకి సైన్స్ పోటీలకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పాఠశాల స్థాయి నవంబర్ 7, మండల స్థాయి 21, జిల్లా స్థాయి 28, రాష్ట్ర స్థాయి సంబురాలు డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతుల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. సంపత్, రమేశ్, తౌటు మధుసూదన్, పాండురంగం పాల్గొన్నారు.
ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం ఇవ్వాలి
సిరిసిల్లటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు శనివారం కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, టౌన్ సీఐ కృష్ణలను కలిశారు. విలీన గ్రామాలు చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూర్, సర్దాపూర్ ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడుకు చెందిన రైతులు వడ్లు ఆరబెట్టుకునేందుకు స్థలం లేదన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబోసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రాలు అందించారు. మాజీ కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, పోచవేని సత్య ఎల్లయ్య, బుర్ర లక్ష్మి శంకరయ్య, కల్లూరి లతా మధు, లింగంపల్లి సత్యనారాయణ, జీల కిషన్ తదితరులు ఉన్నారు.
బాలికల సంక్షేమానికి పెద్ద పీట
బాలికల సంక్షేమానికి పెద్ద పీట
బాలికల సంక్షేమానికి పెద్ద పీట