
ప్రభుత్వ ఆస్పత్రి.. వైద్యసేవల్లో భేష్
వేములవాడ ఆస్పత్రిలో నిత్యం ఆపరేషన్లు మోకీలు మార్పిడిలకు ప్రత్యేకం ఆస్పత్రిలో నిత్యం ఆపరేషన్లు ఆస్పత్రి సేవలకు అభినందనల వెల్లువ
వేములవాడఅర్బన్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. ఇది గతం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే.. వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇబ్బందిగా మారడం.. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్యసేవలు వేములవాడ ఏరియా ఆస్పత్రికి రోగులు క్యూ కట్టేలా చేస్తున్నాయి. ఉచితంగా మోకీలు మార్పిడి.. నాణ్యమైన ప్రసూతి వైద్యసేవలు.. రోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి వైద్యసిబ్బంది. వీరి సేవలకు గుర్తుగా ఇప్పటికే నాలుగుసార్లు కాయకల్ప అవార్డు దక్కింది. వేములవాడ ఆస్పత్రి వైద్యసేవలపై ప్రత్యేక స్టోరీ.
నిత్యం 450 నుంచి 650 మందికి వైద్యం
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో నిత్యం 450 నుంచి 650 మంది వరకు ఔట్‌పేషంట్లుగా వైద్యసేవలు పొందుతున్నారు. అన్ని విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటారు. వేములవాడ ప్రాంతంలో పేదలకు ఈ ఆస్పత్రి వరంగా మారింది. ఇక్కడి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ సెంటర్ ఉంది. రెండు అంబులెన్స్‌లు, ఆరు బాడీఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఆస్పత్రి ఆ వరణలో పోస్టుమార్టమ్ గదిని నిర్మించారు.
నాలుగుసార్లు కాయకల్ప
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు, పరిశుభ్రతను గుర్తించి వరుసగా నాలుగుసార్లు వరుసగా కాయకల్ప అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు ద్వారా అందుతున్న నిధులతో ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
24 గంటల్లో 20 ఆపరేషన్లు
ఇటీవల 24 గంటలో 20 వివిధ రకాల ఆఫరేషన్లు చేయడంతో ఆసుపత్రి వైద్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైద్యులను అభినందించారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 48 మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు.
డైస్ సెంటర్
ఏరియా ఆస్పత్రిలో డైస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పుడే పుట్టిన శిశువు తొలిదశలోనే వివిధ రకాల వ్యాధులను గుర్తించడం జరుగుతుంది. ఈ సెంటర్‌లో పిల్లల వైద్యుడు, సైకాలజిస్ట్, స్టాప్‌నర్సు ఉంటారు. ఈ సెంటర్‌లో 0–18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వైద్యసేవలు అందిస్తారు.
2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు