
ఖతర్‌లో తెలంగాణ ధూంధాం
సిరిసిల్ల: తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఖతర్‌లో ఐడియల్ ఇండియన్ స్కూల్ ఓపెన్‌గ్రౌండ్‌లో తెలంగాణ ధూం ధాం నిర్వహించారు. తెలంగాణ ఆటాపాటలతో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ హెడ్ వైభవ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. యాంకర్ రాములమ్మ, గాయని వరం ఫోక్‌సాంగ్స్ తో అలరించారు. చివరలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సుమారు 3వేల మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు హాజరయ్యారు. తెలంగాణ ప్రజాసమితి–ఖతర్ ప్రెసిడెంట్ గద్దె శ్రీనివాస్, వైస్‌ప్రెసిడెంట్ మండల అశోక్(సిరిసిల్ల), కార్య నిర్వహణ కమిటీ సభ్యులు గడ్డం హారిక, ఉప్పుల సతీశ్, వెల్దండి వేణుప్రసాద్, ఏముల రాధిక, గౌరి సతీశ్ ఉప్పుల, మనోజ్‌కుమార్ డికొండ, ఉపేందర్ రాడం, శృతి ఉపేందర్ రాడం, లక్ష్మణ్ మంద తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ఆటా పాట హాజరైన తెలంగాణ ప్రవాసీలు