
చికిత్స బాగుంది
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో సాదారణ కాన్పులో పాపకు జన్మనిచ్చాను. ఆస్పత్రిలో వైద్యసేవలు బాగున్నాయి. ఆస్పత్రి శుభ్రంగా ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. మందులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు.
– ఎండీ సాన, తంగళ్లపల్లి
గర్భసంచిలో కణతులు తొలగించారు
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు బాగున్నాయని తెలిసి వచ్చాం. వైద్యులను సంప్రదిస్తే గర్భసంచిలో కణతులు ఉన్నాయని తెలిపారు. వైద్యులు ఆఫరేషన్ చేసి గర్భసంచిలో పైబ్రాయిడ్ కణతులు తొలగించారు. దగ్గరుండి చూసుకుంటున్నారు. – రమ, సింగారం(ఎల్లారెడ్డిపేట)
వైద్యసేవలు వినియోగించుకోవాలి
వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నాం. అన్ని రకాల పరీక్షలు, సీటీ స్కాన్, ఎక్స్‌రే సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆస్పత్రి వైద్యసేవలు వినియోగించుకోవాలి.
– పెంచలయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్

చికిత్స బాగుంది

చికిత్స బాగుంది