
పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో శనివారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మహ్మద్ ఖాదర్–హుస్సేన్ బీ దంపతుల గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి దంపతులకు నూతన వస్త్రాలను అందజేసి ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకుపోతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం.. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాం మీరు ఓట్లు అడగకుండా ఉండాలి.. అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, నాయకులు సాసాల మల్లారెడ్డి, నంద్యాడపు సాగర్ పాల్గొన్నారు.