
వయోవృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలి
అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్
ఇల్లంతకుంట(మానకొండూర్): కొత్త సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపులు సాగేలా సమాఖ్య సభ్యులు చూడాలని అడిషనల్ డీఆర్డీవో సీహెచ్ శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో సోమవారం ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమాఖ్య సాధారణ సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్లు పైబడ్డ వయోవృద్ధుల సంఘాలు, అంగవైకల్యులు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సభ్యులకు సూచించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, ఏపీఎం లతామంగేశ్వర్వీ, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు వి.వెంకటేశం, రాజేశ్వరీ, దేవేందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు కట్ట సౌమ్య తదితరులు పాల్గొన్నారు.