ఇది ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ప్రైవేటు వ్యాపారుల ధాన్యం కొనుగోళ్లు. ఇక్కడ రైతులు కోసిన వడ్లను ఆరబెట్టకుండానే నేరుగా బాయిల్డ్ మిల్లులకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,389 నిర్ణయించగా.. దళారులు రూ.1,730కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో బస్తాను 70 కిలోలు తూకం వేస్తూ.. రెండు కిలోల తరుగు పేరిట 68 కిలోల వడ్లకు ధర చెల్లిస్తున్నారు. ఇలా రైతులు ప్రతీ క్వింటాలుకు రూ.659 నష్టపోతున్నారు. ప్రభుత్వ పరంగా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు వడ్లను దళారులకు అమ్ముకుంటున్నారు.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సాగుతున్న వరికోతలు. ముందుగా నాట్లు వేసుకోవడంతో ముందే వరికోతలు రాగా.. వర్షాల కారణంగా పది రోజుల ఆలస్యంగా కోతలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వడ్లు చేతికి వస్తుండగా ఆరబెట్టేందుకు కల్లాలు లేవు. దీంతో రైతులు రోడ్లపై వడ్లను ఆరబోయాల్సిన దుస్థితి.
రెక్కల కష్టం దోచేస్తున్నారు !
రెక్కల కష్టం దోచేస్తున్నారు !
రెక్కల కష్టం దోచేస్తున్నారు !