
నిర్లక్ష్యం వీడండి
సిరిసిల్ల అర్బన్: అధికారులు ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వీడి.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అనంతరంలో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ సమస్యలపై 81 దరఖాస్తులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో శేషాద్రి స్వీకరించారు.