
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: గుండె ఆగిపోయి ఎవరైనా అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే గుండెకు ఉపశ్వాస పునరుద్ధరణ(సీపీఆర్) అందించడంపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో సోమవారం సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. రజిత మాట్లాడుతూ గుండె ఆగిపోయినప్పుడు రక్తప్రసరణ ఆగిపోయి మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందదన్నా. అలాంటి సమయంలో వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఒక్క నిమిషం వ్యవధిలో గుండైపె 100 నుంచి 120 సార్లు రెండు చేతులతో నొక్కాలని సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తులను సీపీఆర్ చేసిన తరువాత 108లో ఆస్పత్రికి తరలించాలని కోరారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యులు సంపత్‌కుమార్, రామకృష్ణ, నయిమా జహా పాల్గొన్నారు.