గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

Oct 14 2025 6:57 AM | Updated on Oct 14 2025 6:57 AM

గ్రీవ

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ‘పనులు చేస్తూనే దర్శనం కల్పించండి’ ప్రభుత్వ లోగోకు క్షీరాభిషేకం చీఫ్‌ జస్టిస్‌పై దాడి.. రాజ్యాంగంపైనే దాడి ● ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి రవి

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల క్రైం: సమస్యల పరిష్కారం, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్‌చేసి త్వరగా పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రైతులు తాము పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పెద్దలింగాపురం, అనంతారం, చిక్కుడువానిపల్లె, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. 71 మందికి సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చే శారు. ప్యాక్స్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, ఐకేపీ ఏపీఎం లతామంగేశ్వరీ, తహసీ ల్దార్‌ ఫారుఖ్‌, ఎంపీడీవో శశికళ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ప్రసాద్‌, అనంతగిరి టెంపుల్‌ చైర్మన్‌ అంతగిరి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు.

వేములవాడ: అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే భక్తులకు రాజన్న దర్శనం కల్పించేందుకు చొరవ చూపాలంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఈవో రమాదేవిని కోరారు. ఈమేరకు సోమవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడు తూ తమ పార్టీ ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎర్రం మహేశ్‌, లింగంపల్లి శంకర్‌, రాపెల్లి శ్రీధర్‌, పొన్నాల తిరుపతిరెడ్డి, బర్కం లక్ష్మి, రాజిరెడ్డి, హరీశ్‌ ఉన్నారు.

వేములవాడ: రాజన్న ఆలయ అబివృద్ధి విషయంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ప్రభుత్వ లోగోకు క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దని కోరారు. అభివృద్ధి పనులు జరుగుతుండగా భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలన్నారు. సంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్‌, చిలుక రమేశ్‌, రాజు, కొమురయ్య, విష్ణు, పోచెట్టి, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లఅర్బన్‌: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవిమాదిగ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం నల్లా జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దాడి చేసిన వ్యక్తితోపాటు దాడి వెనుక ఉన్న శక్తులను శిక్షించాలని కోరారు. ఈనెల 17న మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని కోరారు. ఆవునూరి ప్రభాకర్‌, కానపురం లక్ష్మణ్‌, భిక్షపతి, శోభారాణి, రవీందర్‌, రాజు, లచ్చన్న, బాలయ్య పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు1
1/4

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు2
2/4

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు3
3/4

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు4
4/4

గ్రీవెన్స్‌ డేకు 27 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement