● మురుగుపై పట్టింపేది ? ● పట్టించుకోని అధికారులు ● డ్రెయినేజీలు నిర్మించాలని డిమాండ్
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి లోని కాలనీల్లో డ్రెయినేజీలు లేక కంపు కొడుతున్నా యి. రోడ్లపైనే మురికినీరు పారుతుండడంతో దు ర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా దోమలు పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారుల పట్టింపు లేక కా లనీ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ..ఇన్నీ కావు.
మల్లారం రోడ్డులో..
వేములవాడ పట్టణంలోని మల్లారం రహదారిని ఆనుకుని ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న మురికినీరు రోడ్డుపైనే పారుతోంది. ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న పలు కాలనీల్లో డ్రెయినేజీలు లేవు. దీంతో మురికినీరు రోడ్లపైనే పారుతోంది. రోడ్లపై నడవలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతున్నారు.
తిప్పాపూర్‌లో రోడ్డుపైకి మురికినీరు
మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా వేములవాడ–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా మురికినీరు నిలిచి పరిసరాలు కంపు కొడుతున్నాయి. పాదచారులు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ఇటీవల నిత్యం వర్షం పడుతుండడంతో పరిసరాలు మరింత కంపుకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లిలో దుర్వాసన
వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని వేములవాడ–నాంపల్లి రహదారిని ఆనుకుని మురికికాలువలు లేకపోవడంతో మురికినీరు రోడ్డుపైనే పారుతుంది. డ్రెయినేజీలు లేక మట్టికాలువలు కూలి మురికినీరు ఆగుతుంది.
నాంపల్లి రోడ్డు పక్కన మురికి కాలువ
మల్లారం రోడ్డు పక్కన పారుతున్న మురికి కాలువ
కంపుకొడుతున్న కాలనీలు