
శ్రీవారి ఆదాయం రూ.8.61లక్షలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయశాఖ అదికారులు లెక్కించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 8,61,032 వచ్చిందని ఈవో మారుతిరావు తెలిపారు. ఈవో మాట్లాడుతూ గతేడాది కంటే ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆదాయం రూ. 1,78,657 అధికంగా వచ్చిందన్నారు. హుండీ ద్వారా రూ.3,40,582, టికెట్లు, ప్రసాదాల ద్వారా రూ.5,20,450 వచ్చిందని వివరించారు. లెక్కింపులో అధికారులు పాము సత్యనారాయణ, పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అర్చకస్వాములు కృష్ణమాచారి పాల్గొన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం
ముస్తాబాద్(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్‌లోని ఏఎంఆర్ గార్డెన్స్‌లో గురువారం బీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, విజయరామారావు, సెస్ మాజీ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, జెడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఏఎంసీ మాజీ చైర్మన్ జానబాయి, బాల్‌నర్స్, సంతోష్‌రావు, సుమ తి, సావిత్రి, మనోహర్, భరత్ పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యం సాధించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. ఇల్లంతకుంట పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే నష్టాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎన్సీడీ, టీబీ కేసులు, ఇమ్యూనైజేషన్, ఓపీ, రక్తపరీక్షలు, సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడారు. అనంతరం గాలిపల్లి పల్లె దవాఖానాను పరిశీలించారు. వైద్యులు సంపత్‌కుమార్, రామకృష్ణ, అనిత, కోల్డ్ చైన్ మేనేజర్ నవీన, డాక్టర్ జీవనజ్యోతి, కట్ట రమేశ్, హెచ్‌ఈవో వెంకటరమణ, ప్రసాద్, సూపర్వైజర్ జవహర్ పాల్గొన్నారు.
వైన్‌షాపులకు దరఖాస్తులు
సిరిసిల్ల క్రైం: జిల్లాలో మొత్తం 48 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. గురువారం నాడు కొత్తగా 20 దరఖాస్తులు అందాయని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు 146 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు అందజేసే అవకాశం ఉందని తెలిపారు.
నామినేషన్ ఏర్పాట్లు పరిశీలన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల పరిషత్‌లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఏర్పాట్లను గురువారం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. మెటీరియల్ గురించి ఇల్లంతకుంట రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో శశికళను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఫరూక్, ఎంపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

శ్రీవారి ఆదాయం రూ.8.61లక్షలు

శ్రీవారి ఆదాయం రూ.8.61లక్షలు