
ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి
● డీఆర్‌డీవో శేషాద్రి
ముస్తాబాద్(సిరిసిల్ల): కూలీలకు పనులు కల్పించేందుకు చేపట్టిన ఉపాధిహమీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని డీఆర్‌డీవో శేషాద్రి సూచించారు. ముస్తాబాద్ మండల పరిషత్‌లో 2024–25లో చేపట్టిన రూ.5.35కోట్ల పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను శుక్రవారం నిర్వహించారు. తెర్లుమద్దిలో 29 రోజుల వేతనాలను కూలీలు పొందలేకపోయారని డీఆర్‌పీలు వెల్లడించారు. ముగ్గురికి రూ.514 అదనంగా చెల్లించారన్నారు. ఇలా మొత్తంగా రూ.17,500 రికవరీకి ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.3వేల జరిమానా విధించారు. ఎంపీడీవో లచ్చాలు, ఎస్‌ఆర్‌పీ బాలు, ఎస్‌టీఎం సాయిజ్ఞానేశ్వర్, విజిలెన్స్ ఆఫీసర్ రామారావు, అరుణ్‌రాకేశ్, ఎంపీవో బీరయ్య పాల్గొన్నారు.