● డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి
సిరిసిల్లఎడ్యుకేషన్: విద్యతోనే విచక్షణ, జ్ఞానం వస్తాయని డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన పదో తరగతి వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యతోనే జీవితాన్ని సరైన దిశలో మలుచుకునే అవకాశం లభిస్తుందన్నారు. వ్యక్తిగత జీవితంతోపాటు సమాజ వికాసానికి దోహదపడుతుందన్నారు. ఇష్టపడి చదివితే విజయాలు దరిచేరుతాయని పేర్కొన్నారు. హెచ్‌ఎం మోతిలాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, స్టాప్ సెక్రెటరీ మల్లేశం పాల్గొన్నారు.