
ప్రజాసేవతోనే ఆత్మసంతృప్తి
● ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ లక్ష్మణ్‌రావు ● 873 మందికి ఉచిత పరీక్షలు ● 70 మందికి కంటి ఆపరేషన్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసేవతోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని, పురిటిగడ్డ రుణం తీర్చుకునే అవకాశం లభించిందని అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ అయ్యప్ప ఆలయంలో పది రోజులు నిర్వహించిన కంటి మెగా వైద్యశిబిరం శనివారం ముగిసింది. డాక్టర్ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ అమెరికాలో 40 ఏళ్లుగా ఫిజీషియన్‌గా పనిచేశానన్నారు. మాతృదేశంలో సేవ చేయాలని కల్వకుంట్ల రమాదేవి జ్ఞాపకార్థం శంకర నేత్రాలయ సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 873 మందికి కంటి పరీక్షలు చేసి, ఇక్కడే 70 మందికి కంటి ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. మరో 113 మందిని చైన్నెకి రిఫర్ చేశామన్నారు. అయ్యప్ప ఆలయంలో రూ.3లక్షలతో వాటర్‌ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. లక్ష్మణ్‌రావును ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ శంకర్, రాజుగురుస్వామి సత్కరించారు. నవీన్‌రావు, సడిమెల ఎల్లం, నాగరాజు, సంతోష్, గిరి, నందు పాల్గొన్నారు.