
సీఎమ్మార్‌ఎఫ్ చెక్కుల అక్రమదందాపై విచారణ చేపట్టాలి
● జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు
ఇల్లంతకుంట(మానకొండూర్): మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కేంద్రంగానే సీఎమ్మార్‌ఎఫ్ చెక్కుల అక్రమదందా కొనసాగుతోందని, నియోజకవర్గంలో రూ.50లక్షల వరకు చెక్కులు చేతులు మారాయని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు ఆరోపించారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంటలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. రహీంఖాన్‌పేటలో అక్రమంగా చెక్కు డ్రా చేసుకున్న సంఘటనలో అసలు వ్యక్తిని వదిలి గ్రామస్థాయి కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. బెజ్జంకి, వల్లంపట్ల గ్రామాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఏసీబీ అధికారులతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. బొల్లం వెంకన్న, ఎండీ సాదుల్, కూనబోయిన రఘు, కూస నరేశ్, చదువాల పర్శరామ్, సత్యం పాల్గొన్నారు.