● వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం ● మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
సిరిసిల్ల: జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లు కమ్ముకుంటున్నాయని ‘చీకట్లో సిరిసిల్ల’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య రగుడు జంక్షన్‌లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయని తెలిపారు. త్వరలో అక్కడ లైట్లు వెలుగుతాయని వివరించారు. సిరిసిల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో వీధిదీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ అనుమతితో నిధులు మంజూరు చేయించి 39 వార్డుల్లోనూ వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘సాక్షి’ కథనంతో వీధి దీపాల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.
సిరిసిల్లలో చీకట్లు తొలగిస్తాం