సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

Mar 12 2025 7:26 AM | Updated on Mar 12 2025 7:23 AM

వేములవాడ: వేములవాడ కోర్టులో నెలకొన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోర్ట్‌ పోలియో జడ్జి నామవరపు రాజేశ్వరరావును మంగళవారం హైకోర్టులో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ, వేములవాడకు అడిషనల్‌ కోర్టు మంజూరు చేయాలని, తదితర సమస్యలపై జడ్జికి వివరించినట్లు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్‌, న్యాయవాదులు నక్క దివాకర్‌, పంపరి శంకర్‌, గుజ్జే మనోహర్‌ ఉన్నారు.

వివరాలు పక్కాగా నమోదు చేయాలి

సిరిసిల్ల: రికార్డుల్లో స్కానింగ్‌ వివరాలు పక్కాగా నమోదు చేయాలని పోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని స్పష్టం చేశారు. స్కానింగ్‌ సెంటర్లలో రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో డాక్టర్లు రాజ్‌కుమార్‌, శీలాశిరీష, హెచ్‌ఈ బాలయ్య, ఉమెన్‌ వెల్ఫేర్‌ దేవిక, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్లకల్చరల్‌: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం రెండో విడతలో దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 31 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికై న విద్యార్థులకు ప్రతి నెలా రూ.5వేల భత్యం అందజేస్తారని పరిశ్రమల శాఖ సంచాలకుడు డాక్టర్‌ జి.మల్సూర్‌ తెలిపారు. ఏడాది పాటు సాగే ఇంటర్న్‌షిప్‌లో ఆరునెలల పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. 21 నుంచి 24 ఏళ్ల వయస్సు, పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండి, వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. pminternship. mca. gov. in అభ్యర్థులు తమ వివరాలు పొందుపరచాలని, మరిన్ని వివరాలకు టోల్‌ ఫ్రీ 18001 16090 నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు.

విద్యారంగానికి నిధులు కేటాయించాలి

సిరిసిల్లటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించగా వక్తలు మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్‌ స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుచేసి ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కళ్యాణ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్‌, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్‌కుమార్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, ఐ ద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముశం రమేశ్‌, మల్లారపు ప్రశాంత్‌, జాలపల్లి మనోజ్‌కుమార్‌, గర్‌ల్స్‌ కన్వీనర్‌ సంజన, సాయిభరత్‌, శ్రీధర్‌, తల్లిదండ్రుల సంఘం నాయకులు సత్యం, రవి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు   పరిష్కరించాలని వినతి
1
1/2

సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు   పరిష్కరించాలని వినతి
2
2/2

సమస్యలు పరిష్కరించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement