మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Mar 8 2025 1:24 AM | Updated on Mar 8 2025 1:23 AM

● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి

సిరిసిల్లటౌన్‌: పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కేక్‌ కోసి సంబరాలు జరిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, డాక్టర్‌ తడక రవళి, మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, ఎక్స్‌ ఎంపీపీ సంకినేని లక్ష్మి, మాధవి, జయశ్రీ, భవిత, లావణ్య, సుస్మిత పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రతిభ

వేములవాడఅర్బన్‌: అగ్రహారం ప్ర భుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్రం విద్యార్థులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్ర తిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్‌ శంకర్‌ తెలిపారు. విద్యార్థులు జాషువ, విష్ణు, గంగసాయి, అక్షయ్‌, వినయ్‌లు ‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ ఆన్‌ బయింగ్‌ బిహేవియర్‌ ఆర్‌ కన్జ్యూమర్‌ ఎ స్టడీ ఇన్‌ డిస్ట్రిక్ట్‌’ అనే అంశంపై రూపొందించిన స్టడీ ప్రాజెక్ట్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అధ్యాపకులు శకుంతల, వైస్‌ ప్రిన్సిపాల్‌ లావణ్య, కృష్ణప్రసాద్‌, శోభారాణి, శ్రీధర్‌రావు అభినందించారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి1
1/1

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement