వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనశాస్త్రం విద్యార్థులు కళాశాల విద్యాశాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల్లో ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. విద్యార్థులు కిరణ్మయి, సిద్ధార్థ, వెంకట్, లావణ్య, శివాణి ‘ఎనాలసిస్ ఆఫ్ ఫైటో కెమికల్స్ ఇన్ సమ్ వెజిటబుల్స్ అండ్ ప్రూట్స్’ అనే అంశంపై రూపొందించిన స్టడీప్రాజెక్ట్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ రూసా సెంటర్‌లో విద్యార్థులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమర్పించారు. అధ్యాపకులు కరుణ, వైస్‌ప్రిన్సిపాల్ లావణ్య, కృష్ణప్రసాద్, శోభారాణి ఉన్నారు.