న్యూస్‌రీల్
పబ్లిసిటీ పిచ్చితోనే...
ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ తరగతులు
11 నుంచి భైరవకోనలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
రేషన్ కార్డుదారులు: 3,36,818
యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా కూటమి నాయకులే సూత్రధారులు బేస్తవారిపేట, పొదిలి, వినుకొండ ప్రాంతాల్లో రహస్య గోడౌన్లు మార్కాపురం నుంచి కృష్ణపట్నం పోర్టుకు రాత్రివేళ బియ్యం తరలింపు
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో పరిపాలన చేస్తోంది. ప్రజల కోసం పనిచేస్తున్న వలంటీర్లకు ఇచ్చే 5 వేల గురించి మాట్లాడినవారు ఇప్పుడు పనిచేయకుండా పబ్లిసిటీ చేసే వారి కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించడం బాధాకరం, వలంటీర్ వ్యవస్థ ఇంటి వద్దకే సేవలు అందించింది. వారిపై విమర్శలు చేసి ఇప్పుడు పనిచేయకుండా పబ్లిసిటీ చేసే వారికి డబ్బులు ఇవ్వడం దుర్మార్గం.
– మానం శ్రీకాంత్, మాజీ వలంటీర్, ఉలవపాడు
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని పచ్చగద్దలు పక్కదారి పట్టిస్తున్నాయి. అధికార పార్టీ సానుభూతిపరులైన డీలర్లు, కొందరు అధికార పార్టీ నాయకులు కలిసి సిండికేట్‌గా మారి రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. బియ్యం దందా గురించి తెలిసినా అధికారులు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు.
మార్కాపురం:
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రేషన్ ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర వస్తువులను ప్రభుత్వం అందజేయడంతో ప్రజలకు ప్రతి నెలా రేషన్ సక్రమంగా అందేది. రేషన్ షాపులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన పని ఉండేది కాదు. రేషన్ కోసం ఒక రోజంతా పనులు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేయడంతో మళ్లీ 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా రావాల్సిన రేషన్ వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. రేషన్ డీలర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. బియ్యం సేకరణకు గ్రామస్థాయిలో ఏజెంట్లను నియమించుకున్నారు. ఇలా ప్రతి నెలా సేకరించిన బియ్యాన్ని లారీల్లో దర్జాగా పోర్టుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అధికారులు, ముఖ్య ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటన కార్యరూపం దాల్చడంలేదు.
జిల్లాలో మొత్తం 742 రేషన్ దుకాణాలు ఉండగా, 3,36,818 మంది రేషన్‌కార్డులున్నాయి. ఆయా కార్డుల్లో మొత్తం 10,21,038 మంది సభ్యులున్నారు. ప్రతినెలా 51,05,190 క్వింటాళ్లు (సుమారు) బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, పొదిలి పట్టణాల్లో పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లు ఉన్నాయి. ఇక్కడ నుంచి బియ్యం, చక్కెరను ప్రతినెలా 20 నుంచి 30వ తేదీ లోపు రేషన్ దుకాణాలకు తరలిస్తారు. అక్కడ డీలర్లు కార్డుదారులకు అందించాల్సి ఉంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్‌కార్డుదారులకు బియ్యం, చక్కెర ఇతర నిత్యావసర వస్తువులు అందించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ దుకాణాలన్నీ కూటమి పార్టీ నాయకులు నియమించిన డీలర్ల నిర్వహణలో ఉన్నాయి. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. డీలర్లు నాలుగైదు రోజులు మాత్రమే రేషన్ ఇచ్చి స్టాక్ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యానికి బదులు కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తాం.. తీసుకోండి అంటూ బహిరంగంగా చెబుతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే మీకార్డు రద్దుచేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలా కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని డీలర్లు ఏజెంట్లకు కిలో 15 రూపాయల ప్రకారం అమ్ముతున్నారు. పలువురు ద్వితీయ శ్రేణి కూటమి నాయకులు బియ్యం అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారారు.
ఊరూరా
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ టెట్ క్లాస్ లను ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1ఎ కు సంబంధించి, మధ్యాహ్నం 2ఎకు సంబంధించిన ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన బిట్ బ్యాంక్‌లను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ స్పెషల్ టెట్ క్లాస్‌లను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉపయోగించుకుని అందరూ ఉత్తీర్ణులు కావాలన్నారు. రాష్ట్ర సంఘం గతంలో టెట్ మెటీరియల్, మోడల్ బిట్ బ్యాంకు తయారుచేసి అందించడం ద్వారా సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. కార్యక్రమంలో వై వెంకట్రావు, జి ఉమామహేశ్వరి, ఎన్ చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎస్‌పురం (పామూరు): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం మండలంలోని భైరవకోనలో ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు తెలిపారు.
భైరవకోనలో త్రిముఖ దుర్గాదేవి ప్రత్యేక అలంకారాలు:
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భైరవకోన త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు 11వ తేదీ ఆదివారం నాడు బాలత్రిపుర సుందరీదేవిగా, 12న శ్రీరాజరాజేశ్వరీదేవి, 13న అన్నపూర్ణాదేవి, 14న శ్రీగాయత్రీదేవి, 15న మోహినీదేవి, 16న శ్రీగజలక్ష్మీదేవి, 17న సరస్వతీదేవి, 18న మహిషాసురమర్దిని, 19న శ్రీదుర్గాదేవి, 20న లలితాదేవిగా విజయదశమితో వేడుకలు ముగియనున్నట్లు వారు తెలిపారు.


