నీటి వృథాకు చెక్ పెట్టేలా,..
ప్రకాశం:
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్–మానక్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. సమాజంలోని నిత్యజీవిత సమస్యలకు సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను చూపేలా విద్యార్థులు ఈ ప్రాజెక్టులను రూపొందించడం విశేషం. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ ఉపాధ్యాయులను
సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ పబ్లిక్ ట్యాప్ కంట్రోల్ సిస్టమ్
ప్రాజెక్టుతో విద్యార్థి కనుమర్ల రంగస్వామి రెడ్డి
విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
జాతీయ స్థాయి ప్రదర్శనకు జిల్లా నుంచి మూడు ప్రాజెక్టుల ఎంపిక
విద్యార్థులకు అభినందించిన అధికారులు
కుళాయిల వద్ద భారీగా తాగునీరు వృథా అవుతోంది. ఈ సమస్యను అరికట్టేందుకు అర్ధవీడు మండలం నాగులవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కనుమర్ల రంగస్వామిరెడ్డి ఉపాధ్యాయుడు కె.కొండలరావు సహకారంతో సెన్సార్, ఆర్డునో యునో, రిలే, వాటర్ మోటార్ సహాయంతో ఆటోమేటిక్ ట్యాప్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించాడు.ఈ పరికరంతో కుళాయి కింద పాత్రను ఉంచినప్పుడు మాత్రమే నీరు సరఫరా కావడం, పాత్ర నిండిన తర్వాత దాన్ని తొలగించగానే నీటి సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
ప్రకాశం, మార్కాపురం డీఈఓలు వి.రేణుక, ఎస్ సుబ్బారావులు అభినంధించారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జాతీయ స్థాయి ఇన్‌స్పైర్–మానక్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి టి. రమేష్ తెలిపారు.


